నాగర్ కర్నూల్‌ (Nagarkurnool) జిల్లా లింగాల (Lingala) మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి (Government Hospital) తరలించారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని వైద్యులు తెలిపారు.

నాగర్ కర్నూల్‌ (Nagarkurnool) జిల్లా లింగాల (Lingala) మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి (Government Hospital) తరలించారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ హైరిస్కు ఉండడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూపరింటెండెంట్‌ సూచించారు. ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగు తుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు (MLA Dr.Vamshikrishna) ఫోన్‌ చేసి విషయం తెలిపారు.

ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో (Dr.Sravanthi) కలిసి గర్భిణికి సిజేరియన్‌ (Cesarean) చేశారు. ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా.. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రభుత్వాస్పత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో (Achampet) శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Updated On 13 Jan 2024 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story