రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC Elections) త్వరలో జరుగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC Elections) త్వరలో జరుగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆశావహుల్లో బీసీ సామాజికవర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్(Working President ) మహేష్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌(Mahesh Mahesh Kumar Goud), ఈరవత్రి అనిల్‌ పేర్ల (Eravathri Anil)ను, ఎస్టీ నుంచి బలరాం నాయక్‌(Balaram Naik), ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar) పేర్లను హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఓసీ కోటా నుంచి పటేల్‌ రమేష్‌(Patel Ramesh)పేరు పార్టీ పెద్దల దృష్టిలో​ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో మహేష్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్ పేర్లు ఫైనల్ అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే..రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో.. అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated On 15 Jan 2024 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story