బండి సంజయ్(Bandi Sanjay) అరెస్ట్(Arres) అంతా నాటకమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఆడుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ కి సమస్య వస్తే బీఆర్ఎస్, బీఆర్ఎస్ కు సమస్య వస్తే బీజేపీ ఆదుకుంటుందని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ అంతా ఓ డ్రామా అని కామెంట్ చేశారు. పేపర్ లీక్ కాదు. మాస్ కాపీయింగ్ అని సీపీ తేల్చేశారని అన్నారు.

Congress Ex MP Ponnam Prabhakar Comments Bandi Sanjay
బండి సంజయ్(Bandi Sanjay) అరెస్ట్(Arres) అంతా నాటకమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఆడుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ కి సమస్య వస్తే బీఆర్ఎస్, బీఆర్ఎస్ కు సమస్య వస్తే బీజేపీ ఆదుకుంటుందని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ అంతా ఓ డ్రామా అని కామెంట్ చేశారు. పేపర్ లీక్ కాదు. మాస్ కాపీయింగ్ అని సీపీ తేల్చేశారని అన్నారు.
బండి సంజయ్ కి బెయిల్ ఎలా వచ్చిందని.. బండి సంజయ్ బెయిల్ పై కూడా హైడ్రామా నడిపారని అన్నారు. బండి సంజయ్ ను హైప్ చేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారం చేస్తుందని ఆరోపించారు. అమిత్ షా, కేసీఆర్ రహస్య ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ ను బలహీన పరిచే కుట్ర జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ కు ఆదరణ పెరగగానే బీఆర్ఎస్, బీజేపీ డ్రామా మొదలవుతుందని ఆరోపించారు.
టీఏస్ పీఏస్సీ పేపర్ లీక్ పై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. టీఏస్ పీఏస్సీ ఛైర్మన్ రాజీనామాను కేసీఆర్ ఆపారని పొన్నం ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫార్ములా ను బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ లో అమలు చేస్తుందని అన్నారు. సమర్థవంతమైన పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
ఏ-1 గా ఆరోపణలు ఏధుర్కోంటున్న బండి సంజయ్ కి బెయిల్ వచ్చేంత వీక్ గా పోలీసుల వాదన ఉందంటేనే.. డ్రామా గా అర్దం అవుతుందని అన్నారు. బండి సంజయ్ ఆస్కార్ ఆర్టిస్ట్ అని.. మరోసారి కరీంనగర్ లో గెలవడని అన్నారు. కాంగ్రెస్ ను వీడే వారందరినీ స్క్రాప్ గా భావిస్తున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు.