వైసీపీ(YSRCP) రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramakrishna raju) ఏపీలో అడుగుపెట్టారు. నేడు తిరుమలలో పర్యటించిన‌ట్లు ఆయనే స్వ‌యంగా ట్వీట్ ద్వారా తెలియ‌చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమలలో (Tirumala)వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకున్నాను. సుమారు రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

వైసీపీ(YSRCP) రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramakrishna raju) ఏపీలో అడుగుపెట్టారు. నేడు తిరుమలలో పర్యటించిన‌ట్లు ఆయనే స్వ‌యంగా ట్వీట్ ద్వారా తెలియ‌చేశారు. "వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమలలో (Tirumala)వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకున్నాను. సుమారు రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా, అందరికీ శుభం జరగాలని, రాష్ట్ర ప్రజల కోరికలు నెరవేరాలని స్వామివారిని కోరుకున్నాను... ఓం నమో వేంకటేశాయ" అని తెలిపారు.

రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో వైసీపీ త‌రుపున‌ నరసాపురం(Narasapuram) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎంపీగా గెలిచిన కొద్ది రోజుల‌కే వైసీపీ నాయకత్వంతో విభేదాల నేప‌థ్యంలో సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. మా పార్టీ మా పార్టీ అంటూనే వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తుంటారు. గతంలో ఆయ‌న ప‌లుమార్లు తాను రాష్ట్రానికి రాలేని పరిస్థితులు ఉన్నాయంటూ.. అందుకే నియోజకవర్గానికి దూరమయ్యారను అంటూ అధికార వైసీపీపై ఆరోపణలు చేశారు.

Updated On 25 March 2024 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story