విద్యార్థినుల (Students) పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆ కాలేజ్ విద్యార్థునుల పట్ల కాలయమడు అయ్యాడు తెలంగాణ శ్రీచైతన్య కాలేజ్ చైర్మన్ (Telangana Sri Chaithanya College Chairman).

srichaithanya telangnaa
విద్యార్థినుల (Students) పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆ కాలేజ్ విద్యార్థునుల పట్ల కాలయమడు అయ్యాడు తెలంగాణ శ్రీచైతన్య కాలేజ్ చైర్మన్ (Telangana Sri Chaithanya College Chairman). హసన్‌పర్తి (Hasanparthi) మండలం భీమారంలోని (Bheemaram) ఓ జూనియర్ కాలేజ్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి గిరిజన విద్యార్థినిపై లైంగిక దాడికి (Harrashment) పాల్పడేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హసన్‌పర్తి మండలం భీమారంలోని తెలంగాణ శ్రీచైతన్య జూనియర్ కాలేజ్‌లో ములుగు జిల్లా గోవిందరావుపేట (Govindaraopet) మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదవుతోంది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి హాస్టల్‌లోకి (Hostel) ప్రవేశించాడు. ఆ విద్యార్థిని పట్ల లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు అరవడంతో తోటి విద్యార్థినులు నిద్రలేశారు. తన పట్ల చైర్మన్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని విద్యార్థినులపై చేయిచేసుకొని భయభ్రాంతులకు గురిచేశాడు. చైర్మన్ వ్యవహారంపై తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధితురాలు వివరించింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం కాలేజ్‌కు వచ్చి నిలదీశారు. కేయూ పోలీస్‌స్టేషన్‌లో (KU Police Station) ఫిర్యాదు చేయడంతో నిందితుడు బూర సురేందర్‌గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బూర సురేందర్‌గౌడ్ (Boora Surendar Goud) పరారీలో ఉన్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ (ABVP) విద్యార్థులు కాలేజ్ ఎదుట ధర్నా చేపట్టారు. కాలేజ్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నిందితుడు బూర సురేందర్‌గౌడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు కాలేజ్‌లలో పనిచేసిన సురేందర్‌గౌడ్.. అక్కడ కూడా స్టాఫ్, విద్యార్థినులను వేధించేవాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఇతడిపై పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే కేయూ పీఎస్‌లో రౌడీషీటర్ (Rowdy Sheet) కేసు ఉంది. విశాఖలో జరిగిన దంపతుల హత్య కేసులోనూ సురేందర్‌గౌడ్ నిందితుడని తెలిసింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎఫ్‌సీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదవి తెచ్చుకున్నాడు.
