తెలంగాణ వ్యాప్తంగా చలి (Cold waves) తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ (Hyderabad) సహా రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పడిపోతున్నాయి. రానున్న మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)అధికారులు వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా చలి (Cold waves) తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ (Hyderabad) సహా రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పడిపోతున్నాయి. రానున్న మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)అధికారులు వెల్లడించారు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే దిగువకు పడిపోయే అవకాశం ఉందన్నారు. నిన్న అత్యల్పంగా ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా గెన్నెదరి (Gennedari)లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.