చెన్నై(Chennai)లోని ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్(Kalakshetra Foundation)లో విద్యార్థినుల నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వారు చేస్తున్న నినాదాలు తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu CM) ఎమ్.కె.స్టాలిన్(M. K. Stalin)కు కూడా వినిపించాయి. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
చెన్నై(Chennai)లోని ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్(Kalakshetra Foundation)లో విద్యార్థినుల నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వారు చేస్తున్న నినాదాలు తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu CM) ఎమ్.కె.స్టాలిన్(M. K. Stalin)కు కూడా వినిపించాయి. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
సంప్రదాయ కళలను బోధించే సుప్రసిద్ధ కళాక్షేత్రలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్ ఈ నిరసనలకు కేంద్ర బిందువు. అతగాడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాడు. శిక్షణ పొందుతున్న యువతులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. లైంగిక వేధింపుల( Sexual Harassment)కు పాల్పడుతున్నాడు. అతడి ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఇతడిపై ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు బుక్ చేశారు. ఇతడితో పాటు ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, దుర్భాషలతో తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ రెండు వందలమందికిపైగా విద్యార్థినులు, మహిళలు, విద్యార్థులు నిరసనలు చేయడం ప్రారంభించారు. ఇంతకు ముందు కూడా హరి పద్మన్‌పై తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పలువురు విద్యార్థినులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు కమిషన్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఈ ఆరోపణలలో నిజం లేదని కంప్లయింట్‌ను కొట్టేసింది. నిన్న 90 మంది విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ కూడా ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌ను తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్‌నిర్మించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్టాలిన్‌లకు లేఖ రాశారు. స్టాలిన్ వెంటనే స్పందించారు. దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కళాక్షేత్ర ఫౌండేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. నర్తకి రుక్మిణీదేవి అరుండేల్ ఈ కళాక్షేత్రను స్థాపించారు. భరతనాట్యం, కర్ణాటక సంగీతం, ఇతర సంప్రదాయ కళలలో శిక్షణ ఇస్తుంది. క్రమశిక్షణకు ఇది మారుపేరు. చాలా మంది ప్రముఖ కళాకారులు ఇక్కడి నుంచి శిక్షణ పొందారు. చిన్నంగా ఆరంభమైన ఈ కళాక్షేత్రను 1962లో చెన్నైలోని బీసెంట్ నగర్‌కు మార్చారు. సుమారు 99 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మించారు.