ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt)కార్యచరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే లబ్ధిదారులను తేల్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 17కల్లా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎంట్రీ చేయాలని సీఎస్ శాంతికుమారి(CS Santhikumari) జిల్లా కలెక్టర్లను(District collectors) ఆదేశించారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt)కార్యచరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే లబ్ధిదారులను తేల్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 17కల్లా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎంట్రీ చేయాలని సీఎస్ శాంతికుమారి(CS Santhikumari) జిల్లా కలెక్టర్లను(District collectors) ఆదేశించారు. ముఖ్యంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే మహాలక్ష్మి పథకానికి(Mahalakshmi Scheme) ఈనెలాఖరులోగా శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)కు ముందే ఈ పథకాన్ని అమలు చేయడంపై ఆర్థికశాఖ అధికారుల(Finance officials)తో సీఎం రేవంత్(cm revanthreddy) చర్చించినట్లు సమాచారం. అర్హతలతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated On 4 Jan 2024 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story