మాజీ డీఎస్పీ నళిని(DSP Nalini) పోస్టింగ్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మరోసారి అవకాశం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీలైతే తిరిగి అదే పోస్టును ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పోలీస్‌శాఖ(Police department), వైద్య(Medical department), ఆరోగ్యశాక(HEalth department) సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌ నళినికి పోస్టు ఇవ్వాలని అధికారులు ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో సీఎం రేవంత్.. నళినికి అదే పోస్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో(Election) పోటీ చేసి ఓడిపోయాక తిరిగి ఉద్యోగాల్లో కొందరు చేరుతున్నారు. అలాంటి సమయంలో తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి ఉద్యోగం ఇస్తే తప్పేంటి అని ఆయన ఎదురు ప్రశ్నిచారట. ఒకవేళ పోలీస్‌ శాఖలోకి తీసుకునేందుకు నిబంధనలు అడ్డు వస్తే మరోశాఖలో ఆమెను సర్దుబాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నళిని పలువురు జర్నలిస్టులతో మాట్లాడుతూ... తనకు ఉద్యోగం చేసే ఓపిక లేదని.. తను ఇక జాబ్‌ చేయలేనని.. తన దారి అధ్యాత్మికం వైపు ఉందని వారికి సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

Updated On 16 Dec 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story