ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీఎం రేవంత్‎రెడ్డి(Revanth Reddy)..తన మార్కు పాలనతో సామాన్యులను ఆకట్టుకుంటున్నారు. పార్టీ సీనియర్లతో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డితో(Janareddy) భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని(Jubliee Hills) జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీఎం రేవంత్‎రెడ్డి(Revanth Reddy)..తన మార్కు పాలనతో సామాన్యులను ఆకట్టుకుంటున్నారు. పార్టీ సీనియర్లతో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డితో(Janareddy) భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని(Jubliee Hills) జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంను రేవంత్‎రెడ్డిని జానారెడ్డి దంపతలు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‎రెడ్డి స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయలేదు. ఆయన తనయుడు జైవీర్ రెడ్డి(Jayveer Reddy) నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‎రెడ్డి..జానారెడ్డి మధ్య దాదాపు గంటపైనే చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాలతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతన్న కార్యక్రమాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు జానారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. కేబినెట్‎లో(Cabinet) ఇప్పటికే 11 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా కీలక హోంశాఖ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ప్రస్తుతం హెంశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది.

త్వరలోనే మంత్రివర్గ(Ministry) విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్ధరి మధ్య భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జానారెడ్డి కాంగ్రెస్(Congress) లో సీనియర్ నేత కావడంతో ఆయనకు హోంశాఖ ఇస్తారా?..సీఎం రేవంత్ రెడ్డి అందుకే కలిశారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వలో హోంశాఖతోపాటు వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం జానారెడ్డికి ఉంది. పరిపాలన వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభంతోపాటు పార్టీలో సీనియర్ నేత కావడంతో జానారెడ్డికి రేవంత్‎రెడ్డి కేబినెట్‌లో బెర్త్ ఖాయమనే చర్చ జోరందుకుంది

Updated On 11 Dec 2023 4:12 AM GMT
Ehatv

Ehatv

Next Story