బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో, ఫార్మా సిటీ (Metro & Pharma City Projects) నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( CM Rvanth Reddy) స్పష్టం చేశారు. వాటిని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని, ఎయిర్‌పోర్ట్‌కు దూరం తగ్గిస్తామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నామని, ఎంజీబీఎస్ (MGBS)నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు (Metro Rail)విస్తరిస్తామని సీఎం చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో, ఫార్మా సిటీ (Metro & Pharma City Projects) నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( CM Revanth Reddy) స్పష్టం చేశారు. వాటిని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని, ఎయిర్‌పోర్ట్‌కు దూరం తగ్గిస్తామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నామని, ఎంజీబీఎస్ (MGBS)నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు (Metro Rail)విస్తరిస్తామని సీఎం చెప్పారు. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద చాంద్రాయణ గుట్ట దగ్గర మెట్రో లైన్‌కు లింక్ చేస్తామని, మియాపూర్ (Miyapur)నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తామని పేర్కొన్నారు. అలాగే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తామని, గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నామని, సంక్రాంతి(Sankranthi) లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్‌లను నియమిస్తామని, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. తమ ప్రభుత్వంలో ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవని, అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100 రోజులు పెట్టుకుని కచ్చితంగా అమలు చేస్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.