కొత్త రేషన్ కార్డుల(Ration Card) జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు సీఎం రేవంత్(CM Revanth) పచ్చజెండా ఊపారు.
కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.
కొత్త రేషన్ కార్డుల(Ration Card) జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు సీఎం రేవంత్(CM Revanth) పచ్చజెండా ఊపారు.
కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు(Pension), హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు