Third list tension in YCP: తాడేపల్లి నుంచి పిలుపు..టిక్కెట్ గల్లంతేనా..?!
ఏపీ నేతలను ఎన్నికలు తరుముతున్నాయి. సమయం లేదు మిత్రమా..అన్న సినిమా డైలాగు విన్నాం కదా..ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల్లో అదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకోవాలన్న అతృత అధికార, విపక్ష పార్టీలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. వైసీపీలో అభ్యర్థుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కసరత్తు చేసి 38 మంది అభ్యర్థులను సీఎం జగన్(cm jagan) ప్రకటించారు. తాజాగా మూడో జాబితా(third list)పై మరింత కఠినంగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీ నేతలను ఎన్నికలు తరుముతున్నాయి. సమయం లేదు మిత్రమా..అన్న సినిమా డైలాగు విన్నాం కదా..ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల్లో అదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకోవాలన్న అతృత అధికార, విపక్ష పార్టీలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. వైసీపీలో అభ్యర్థుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కసరత్తు చేసి 38 మంది అభ్యర్థులను సీఎం జగన్(cm jagan) ప్రకటించారు. తాజాగా మూడో జాబితా(third list)పై మరింత కఠినంగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సర్వేల్లో సానుకూలంగా రాకపోతే ఎంత పెద్ద నాయకుడైనా పక్కన పెట్టడానికి సీఎం జగన్ వెనుకాడటం లేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. తాడేపల్లి నుంచి పిలుపు వచ్చిందంటే గుండె ఆగినంత పని అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో జాబితాలో ఎవరికి మూడుతుందోనని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అనంతపురంజిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే(Rayadurgam MLA) కాపు రామచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy)కి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఆయనకు టిక్కెట్ గల్లంతేననే చర్చ అప్పుడే మొదలైంది. ఆయన స్థానంలో రాయదుర్గం బరిలో మాజీ ఎమ్మెల్సీ(Former MLC) మెట్టు గోవిందరెడ్డి(Mettu Govinda Reddy)ని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. కాపు రామచంద్రారెడ్డిపై నియోజకవర్గంలో వ్యతిరేకత వుంది. దీంతో ఆయనను మారిస్తే గెలుపు ఖాయమని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే తనకు సన్నిహితుడైన కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టడానికి కూడా జగన్ వెనుకాడడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే.. ఒకవేళ సిట్టింగ్‌లను పక్కన పెట్టాల్సి వస్తే క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తూనే..అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని జగన్ హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపు రామచంద్రారెడ్డిని తాడేపల్లికి పిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.