2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీసీ అధినేత, సీఎం జగన్(cm jagan) చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందా? అంటే..అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సర్వేల ఆధారంగా దాదాపు 40 నుంచి 60 మంది సిట్టింగ్ ఎ‎‌మ్మెల్యేలను మారుస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా అభ్యర్థులతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తున్న సిట్టింగ్ స్థానాల ఫైనల్ జాబితా రేపోమాపో విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఇంచార్జీల మార్పుపై వైసీపీలో రచ్చ కొనసాగుతోంది.

2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీసీ అధినేత, సీఎం జగన్(cm jagan) చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందా? అంటే..అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సర్వేల ఆధారంగా దాదాపు 40 నుంచి 60 మంది సిట్టింగ్ ఎ‎‌మ్మెల్యేలను మారుస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా అభ్యర్థులతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తున్న సిట్టింగ్ స్థానాల ఫైనల్ జాబితా రేపోమాపో విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఇంచార్జీల మార్పుపై వైసీపీలో రచ్చ కొనసాగుతోంది.

ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయమే ఉంది. ఈ క్రమంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్..అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టారు. సిట్టింగ్‎ల మార్పుపై పార్టీలో రచ్చ కొనసాగుతున్నా.. జూనియర్లు, సీనియర్లు..అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చేస్తున్నారు. ప్రజల్లో ప్రతికూలత, పార్టీలో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను నిర్దాక్ష్యంగా పక్కనపెడుతున్నారు. అటు పాలన..ఇటు పార్టీలో ప్రక్షాళన తీసుకురావడం కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్న వారిని సైతం సర్వేల ఆధారంగా స్థాన చలనం కలిగించడం, టికెట్లు లేదని తెగేసి చెప్పడం వైసీపీ(ycp) శ్రేణులకు మింగుడుపడటం లేదు.

తాజాగా గుంటూరు జిల్లాలోని గురజాల(Gurajala)లో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బీసీనేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి(MLC Janga Krishnamurthy), సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి(MLA Mahesh Reddy) మధ్య టికెట్ పంచాయితీ నడుస్తోంది. ఎమ్మెల్సీ జంగాకు సీఎంవో నుంచి పిలుపురావడంతో..ఆయనకు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పి.గన్నవరం ఎమ్మెల్యే(P. Gannavaram MLA ) కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu)కు టికెట్ ఇవ్వలేమని అధిష్టానం తేల్చేసింది. దీంతో చిట్టిబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నేతలు, కార్యకర్తలు చీలిపోయారు. అటు పెనుగొండ(Penugonda)లోనూ మంత్రి ఉష శ్రీ చరణ్‌(Minister Usha Sri Charan)కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ(MLA Shankar Narayana) వర్గం ఆందోళనకు దిగింది. పెనుగొండకు ఉష శ్రీ చరణ్‌ వద్దు..శంకరన్నే కావాలి అంటూ రాజేశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. నుకొండ వైపు వచ్చే ఆలోచన మంత్రి ఉష శ్రీ విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెనుకొండకు వస్తే మంత్రి ఉష శ్రీ చరణ్‌కు సహకరించే ప్రసక్తే లేదని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అలాగే ఎ‌మ్మింగనూరు ఎమ్మెల్యే(Emminganoor MLA) టికెట్ బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడంతో..ఎమ్మెల్యే కేశవరెడ్డి(MLA Keshav Reddy), బుట్టారేణుక (Butta Renuka) సీఎం జగన్‎ని కలిశారు. ఈ విడత మంత్రి పెద్దిరెడ్డి(Minister Peddireddy)ని ఎంపీకి పంపి, మిథున్‎రెడ్డి(Mithunreddy)ని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే(Machilipatnam MLA) పేర్నినాని( Parninani), హిందూపురం ఎంపీ(Hindupuram MP) గోరంట్ల మాధవ్(Gorantla Madhav) కూడా సీఎం జగన్ ని కలిశారు. ఇంఛార్జీల మార్పుగాని..లేదా టికెట్లు రాబోవని సమాచారం తెలిపే జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలుస్తున్నట్టు సమాచారం. మొత్తానికి దాదాపు 40 నుంచి 60 నియోజకవర్గాల్లో ఇంఛార్జీల మార్పు ఉంటుందన్న సమాచారం. రేపోమాపో అభ్యర్థుల మార్పు ఫైనల్ జాబితా విడుదల చేస్తారనే ప్రచారంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే టికెట్ రాదని తెలిసిన కొంత మంది పార్టీ వీడిపోగా.. మరికొందరు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం గీత దాటబోమంటూనే తమ అనుచరులతో నిరసనలు చేయిస్తున్నారు.

Updated On 29 Dec 2023 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story