CM Jagan Key Meeting With MLAs : పార్టీ ఎమ్మెల్యేలు, రీజినల్ ఇన్‌ఛార్జ్‌లతో జగన్ కీలక సమావేశం , ముందస్తు ఎన్నికలుంటాయా?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు(tadepalli camp office)లో జరిగే ఈ సమావేశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ ఇన్‌చార్జ్‌లు హాజరవుతారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌తో చర్చిస్తారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై కూడా చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు(tadepalli camp office)లో జరిగే ఈ సమావేశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ ఇన్‌చార్జ్‌లు హాజరవుతారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌తో చర్చిస్తారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై కూడా చర్చిస్తారు. వచ్చే వారం నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే జగన్ చాలా సమాచారాన్ని సేకరించారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు జగన్ కర్తవ్య బోధ చేయనున్నారు.
మంత్రివర్గ మార్పులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. టికెట్ ఇస్తే గెలిచేవారిని ఓ కేటగిరిగా, టికెట్ ఇస్తే ఓడిపోయే వారిని మరో కేటగిరిగా విభజించనున్నారు. టికట్ ఇవ్వకపోతే పక్క పార్టీ చేరే వారు కూడా కొందరున్నారు. వీరిని ఇంకో కేటగిరిగా విభజించనున్నారు. పార్టీలో ఉంటూ పార్టీ నష్టం కలిగించే వారి చిట్టా కూడా జగన్ దగ్గర ఉంది. ప్రస్తుతానికి 45 మంది ఎమ్మెల్యేలపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జూన్ వరకు వారికి సమయం ఇచ్చి చూడాలని అనుకుంటున్నారట. 30 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ డిసైడయ్యారట. ఈ రోజు జరిగే సమావేశంలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముందస్తుకు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయ్యడానికి వీలు లేదని కొందరు అంటున్నారు.