రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే గోదావరిజిల్లాలపై కసరత్తు పూర్తి చేసిన సీఎం జగన్..తాజాగా ఉత్తరాంధ్ర(Uttarandhra)పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ సజ్జల(sajjala ramakrishna reddy), మంత్రులు బొత్స(Botsa satayanarayana), పెద్దిరెడ్డి(Peddireddi)ని తాడేపల్లికి పిలిచి ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యంగా ఇంచార్జీల మార్పుపై రిజనల్ కో‎ఆర్డినేటర్లకు సీఎం జగన్ సూచనలు చేసినట్లు సమాచారం.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల మార్పులపై మరింత వేగంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాడేపల్లి కేంద్రంగా గత కొంతకాలంగా అభ్యర్థుల కసరత్తుపై వైసీపీ(Ycp) వ్యూహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉభయగోదావరిజిల్లాల(Godavari Disgricts)పై కసరత్తు పూర్తి చేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్..తాజాగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు..తాడపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్(‎tadepalli cm camp office)కు వరుస కట్టారు. రీజనల్ కోఆర్డినేటర్ల(Regional Coordinators)తోనూ సీ‎ఎం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశంజిల్లా నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో తమకు ఈసారి టికెట్ వస్తుందో లేదోనన్న టెన్షన్‎లో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెనుగొండ ఎమ్మెల్యే(Penugonda Mla) గుండ్ల శంకరనారాయణ(Malagundla Sankaranarayana), శ్రీకాళహస్తి ఎమ్మెల్యే(Srikalahasti Mla) బియ్యపు మధుసూధన్ రెడ్డి (Biyyapu Madhusudhan Reddy), కదిరి ‎ఎమ్మెల్యే(Kadiri MLA) డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డిలు(Dr. Pedaballi Venkata Sidda Reddy)కూడా తాడేపల్లిలో సీఎం జగన్‎ని కలిసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అక్కడి ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఆయా నియోజకవర్గ సిట్టింగ్ లను పిలుచుకుని మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల పనితీరు ఆధారంగా సీఎం జగన్(cm Jagan) ముందుకెళ్తున్నారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో అలాంటి వారిని మార్చేసి.. వేరే వారికి బాధ్యతలు ఇచ్చేలా జగన్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మొదటి విడత 11మందిని మార్పు చేశారు సీఎం జగన్. ప్రజల్లో ఆయా ఎమ్మెల్యేలపై సరైన అభిప్రాయం లేనందునే సీటు ఇవ్వడం లేదని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. తాజా పరిస్థితులతో మిగిలిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ఎవరి సీటు ఉంటుంది.. ఎవరి సీటు ఊడుతుంది..? అన్నదానిపై పార్టీలో సర్వత్ర చర్చ జరుగుతోంది.

మరోవైపు టికెట్ మార్పులు, నేతల అసంతృప్తులపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలంగా ఉండటం వల్లే ఎక్కువ మంది టికెట్లు ‎అడుగుతున్నారని అన్నారు. ఎవరూ టికెట్ అడగడం లేదంటే.. అది చెల్లని పార్టీ అంటూ కామెంట్ చేశారు. అయితే నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనన్న ఆయన..అందరితో మాట్లాడి ఒకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు. పార్టీలో ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు.

Updated On 27 Dec 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story