తెలుగుదేశంపార్టీ(TDP) ప్రభుత్వ హాయంలో అవినీతి కేసులలో చంద్రబాబుకు రిమాండ్‌ విధింపును తప్పుపట్టిన నారా లోకేశ్‌, కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. దాంతో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని విజయవాడ ఏసీబీ(ACB) కోర్టు గురువారం ఆదేశించింది. లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది.

తెలుగుదేశంపార్టీ(TDP) ప్రభుత్వ హాయంలో అవినీతి కేసులలో చంద్రబాబుకు రిమాండ్‌ విధింపును తప్పుపట్టిన నారా లోకేశ్‌, కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. దాంతో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని విజయవాడ ఏసీబీ(ACB) కోర్టు గురువారం ఆదేశించింది. లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇంతకు ముందు 41ఏ నోటీసు కింద సీఐడీ(CID) విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను లోకేశ్‌(Lokesh) ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో(Red book) రాశానని, వారి సంగతి తేలుస్తానని ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. కేసు దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి కోరుతూ విజయవాడ(Vijayawada) ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్‌(Arrest) చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కు వాయిదా వేసింది. లోకేశ్‌కు నోటీసులు ఇవ్వడానికి గురువారం సాయంత్రం తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అప్పుడు లోకేశ్‌ ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. అధికారులు చాలా సేపు వెయిట్‌ చేసి వెనక్కి వచ్చేశారు. ఈ రోజు లోకేశ్‌కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated On 29 Dec 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story