Sexy DP Cheater: సెక్సీ డీపీతో ఉన్న తెలియని నంబర్ నుంచి వాట్సప్ మెసేజ్.. ఓపెన్ చేశారో అంతే సంగతులు!
సైబర్ నేరగాళ్ల (Cyber criminals)వలలో చదువుకున్నవారు కూడా ఇట్టే పడిపోతున్నారు. తర్వాత లబోదిబోమంటున్నారు. సైబర్ కేటుగాళ్లు ఎప్పుడూ ఒకే రకంగా మోసం చేయరు. టెక్నాలజీలాగే వారు కూడా అప్‌డేట్ అవుతున్నారు. లేటెస్ట్‌గా కొత్తరకం మోసం మొదలయ్యింది. 'హలో అండి.. నా ఫోన్‌కాల్స్‌కు మీరు ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? భోజనం అయ్యిందా? కాసేపు మాట్లాడవచ్చు కదా? ' అంటూ ఈ రకమైన మెసేజ్‌లు వాట్సప్‌లకు, టెలిగ్రామ్‌లకు వస్తున్నాయి.
సైబర్ నేరగాళ్ల (Cyber criminals)వలలో చదువుకున్నవారు కూడా ఇట్టే పడిపోతున్నారు. తర్వాత లబోదిబోమంటున్నారు. సైబర్ కేటుగాళ్లు ఎప్పుడూ ఒకే రకంగా మోసం చేయరు. టెక్నాలజీలాగే వారు కూడా అప్‌డేట్ అవుతున్నారు. లేటెస్ట్‌గా కొత్తరకం మోసం మొదలయ్యింది. 'హలో అండి.. నా ఫోన్‌కాల్స్‌కు మీరు ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? భోజనం అయ్యిందా? కాసేపు మాట్లాడవచ్చు కదా? ' అంటూ ఈ రకమైన మెసేజ్‌లు వాట్సప్‌లకు, టెలిగ్రామ్‌లకు వస్తున్నాయి. పైగా ఫ్యాన్సీ నంబర్ల నుంచి! అది కూడా అందమైన అమ్మాయిల అర్థనగ్న ఫోటోల (beautiful girls nude photos)తో సెక్సీ డీపీ(Sexy DP)లు ఉన్న ఫోన్‌లతో! ఉద్యోగం, బిజినెస్ అంటూ ఛాటింగ్ మొదలుపెడుతున్నారు. గిఫ్ట్ కార్డులు కొంటే బ్యాంకు అకౌంట్లో డబ్బులు డబుల్ అవుతాయని, యూ ట్యూబ్‌లో వీడియోలలో చూసి కామెంట్లు, రివ్యూలు రాయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఒక్కో కామెంట్‌కు 50 రూపాయలు ఇస్తామని, రివ్యూలు రాయాల్సిన లింకులను పంపుతున్నారు. ఆ లింకులు నిజమేకాబోలని నమ్మి ఓపెన్ చేశారా? అంతే సంగతులు. నెమ్మదిగా టార్గెట్లు ఇస్తున్నారు. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే మూడు వేల రూపాయల లాభం వస్తుందని చెబుతున్నారు. ఆ టార్గెట్లను పూర్తి చేయగానే ఆన్‌లైన్‌లో ప్రత్యేక అకౌంట్‌ను ఓపెన్ చేసి, వచ్చిన డబ్బులన్నీ అందులో జమ చేస్తున్నారు. కాకపోతే ఆ సొమ్మను విత్‌డ్రా చేసుకోవడమే కష్టం. ఎందుకుంటే ఆ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి కొత్త టార్గెట్లు పూర్తి చేయాలని కండీషన్ పెడుతున్నారు. అలా లక్షల రూపాయలు వసూలు చేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లను ఓపెన్ చేయకూడదని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా గురైతే వెంటనే 1930 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని సూచిస్తున్నారు.