TTD Chairman: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు: భూమన
టీటీడీ (TTD) ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి (Bhoomana Karunakar Reddy) అధ్యక్షతన మంగళవారం తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల వివిధ దశల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
టీటీడీ (TTD) ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి (Bhoomana Karunakar Reddy) అధ్యక్షతన మంగళవారం తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల వివిధ దశల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామన్నారు. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపడతామని.. మూడో దఫాలో ఏర్పేడు (Yerpedu) సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టర్‌ను కోరాం. దీంతో 5 వేల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని.. రిటైర్డ్ ఉద్యోగులకు, ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టు అవుతుందన్నారు. ఈ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొని అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుందని ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారని చెప్పారు.