భారత ప్రభుత్వం(indian government) అందించే సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు విశేష ప్రయోజనాలను పొందుతున్నారు.ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం (central government) అందిస్తున్న పథకాల వట్టిరేట్లను (interest rates) )పెంచుతూ మరో శుభవార్తను ప్రజలకు అందించింది. సరికొత్త చిన్న పొదుపు పథకాల్లో(small savings scheme) పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి సమయం.
భారత ప్రభుత్వం(indian government) అందించే సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు విశేష ప్రయోజనాలను పొందుతున్నారు.ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం (central government) అందిస్తున్న పథకాల వట్టిరేట్లను (interest rates) పెంచుతూ మరో శుభవార్తను ప్రజలకు అందించింది. సరికొత్త చిన్న పొదుపు పథకాల్లో(small savings scheme) పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి సమయం. కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. సుకన్య సమృద్ధి యోజన(sukanya samrudhi yojana) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పత్ర(kisaan vikasa patra) , పోస్టాఫీస్ డిపాజిట్ పథకాలు(post office scheme) మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లకు (senior citizen scheme) వడ్డీ రేట్లు పెంచబడ్డాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేటును 10 నుంచి 70 బేసిస్ పాయింట్లు పెంచారు. అయితే పీపీఎఫ్ (PPF ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. నెలవారీ ఆదాయ ఖాతాపై వడ్డీ ఇప్పుడు 7.1 శాతం నుంచి 7.4 శాతానికి, కిసాన్ వికాస్ పత్రపై 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే వారికి ఇప్పుడు 8 శాతానికి బదులుగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.
టైమ్ డిపాజిట్లపై(Time Deposits) వడ్డీ రేట్లు కూడా పెరిగాయి
ఒకటి, రెండు, మూడు, ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై (deposits) కూడా ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఒక సంవత్సరం కాల డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పటి వరకు 6.6 శాతం వడ్డీ లభించేది. రెండేళ్ల టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ వడ్డీ రేటు 6.8 శాతంగా ఉండేది. అదేవిధంగా మూడేళ్ల కాలపరిమితి(3years ) డిపాజిట్లపై వడ్డీని 6.9 శాతం నుంచి 7.0 శాతానికి పెంచారు.