నీలి చిత్రాల్లో(Blue Film) నటిస్తే లక్షలు వస్తాయని మోసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. విశాఖపట్నానికి(Vizag) చెందిన వివాహితను ఓ కేటుగాడు మోసం చేశాడు. ఈ విష‌య‌మై పంజాగుట్ట(Punjagutta) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వివరాళ్లోకెళితే.. విశాఖపట్నంకు చెందిన వివాహిత దిల్‌షుఖ్ న‌గ‌ర్‌లో(Dilsuknagar) నివాసం ఉంటుంది.

నీలి చిత్రాల్లో(Blue Film) నటిస్తే లక్షలు వస్తాయని మోసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. విశాఖపట్నానికి(Vizag) చెందిన వివాహితను ఓ కేటుగాడు మోసం చేశాడు. ఈ విష‌య‌మై పంజాగుట్ట(Punjagutta) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. వివరాళ్లోకెళితే.. విశాఖపట్నంకు చెందిన వివాహిత దిల్‌షుఖ్ న‌గ‌ర్‌లో(Dilsuknagar) నివాసం ఉంటుంది. వివాహ వేడుకల ఏర్పాట్లు చేస్తూ జీవనోపాధి పొందుతుంది. ఈ క్ర‌మంలోనే నాలుగేళ్ల క్రితం బోనాల చెన్నకేశవ(Bonala chena Keshava) అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ ప‌రిచ‌యంతో నెల రోజుల క్రితం వివాహిత‌కు ఫోన్ చేసిన‌ చెన్నకేశవ.. తనకు తెలిసిన వెబ్‌సైట్‌ వాళ్ళు ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని నీలి చిత్రాల్లో నటిస్తే పది లక్షలు ఇస్తారని చెప్పాడు. ఆర్థిక అవసరాల రీత్యా బాధితురాలు నటించాడానికి సరే అంది.

దీంతో వివాహిత‌ను పంజాగుట్టలోని హోటల్‌కు పిలిపించాడు. అనంతరం డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. బాధితురాలు మత్తులోకి జారుకున్నాక నగ్న వీడియోలు(Nude videos) తీశాడు. ఆ వీడియోలను చూపించి వివాహిత‌ను బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 5 Aug 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story