టికెట్ ఆలపాటికా..నాదేండ్లకా..? పొత్తు చర్చల్లో టీడీపీ-జనసేన మధ్య తెనాలి టికెట్ చిచ్చురేపుతోంది. సీటు జనసేనకేనన్న వాదనలతో రచ్చ రేగుతోంది. పాదయాత్రతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పీడ్ పెంచగా..సైలెంట్‎గానే ముందుకు వెళ్తున్నారు నాదేండ్ల మనోహర్. తెనాలి టిక్కెట‌ ఆలపాటికే ఇవ్వాలని ఆయన అనుచరులు రచ్చ చేస్తన్న్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఆత్మహ్యతాప్రయత్నం కూడా చేశారు. సీట్ల సర్దుబాటుకు ముందే రెండు పార్టీల చిచ్చు పెట్టిన తెనాలి పంచాయతీ తెగేనా?

టికెట్ ఆలపాటికా..నాదేండ్లకా..? పొత్తు చర్చల్లో టీడీపీ-జనసేన మధ్య తెనాలి టికెట్ చిచ్చురేపుతోంది. సీటు జనసేనకేనన్న వాదనలతో రచ్చ రేగుతోంది. పాదయాత్రతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad) స్పీడ్ పెంచగా..సైలెంట్‎గానే ముందుకు వెళ్తున్నారు నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar). తెనాలి టిక్కెట‌ ఆలపాటికే ఇవ్వాలని ఆయన అనుచరులు రచ్చ చేస్తన్న్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఆత్మహ్యతాప్రయత్నం కూడా చేశారు. సీట్ల సర్దుబాటుకు ముందే రెండు పార్టీల చిచ్చు పెట్టిన తెనాలి పంచాయతీ తెగేనా?

టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో టికెట్ల పంచాయతీ (Tickets Issue) అధినేతలకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా తెనాలి టికెట్ తమదే తమదంటూ పట్టుదలకు పోతున్నారు. ఇప్పటికే తెనాలిలో కార్యకర్తల్ని కూడదీసుకుని పాదయాత్ర చేస్తున్నారు టీడీపీ నేత ఆలపాటి. సంక్రాంతి పండక్కి కొంత గ్యాప్ ఇచ్చినా..మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టి..కొనసాగిస్తున్నారు. తెనాలి ఆలపాటికే ఇవ్వాలంటూ అనుచరులు వీరంగం సృష్టిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. నాదేండ్ల మనోహర్ మాత్రం పవన్ కల్యాణ్(Pavan Kalyan) ప్రకటన వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ..స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తోంది. పాదయాత్రతో స్థానికంగా ఆలపాటి, పవన్‎తో స్ట్రాంగ్ లాబీయింగ్‎తో నాదేండ్ల.. రెండువైపులా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. దీంతో తెనాలి సీటు ఎవరికి కేటాయిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే..జనసేనలో నెంబర్ 2 నాయకుడిగా ఉన్న నాదేండ్ల మనోహర్ గతంలో కూడా రెండుసార్లు తెనాలి నుంచి పోటీ చేసి..కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నాదేండ్లకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం తెనాలిలో జోరుగా సాగుతోంది. గతంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నేత ఆలపాటి రాజా కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 2014లో కూడా తెనాలి నుంచి గెలుపొందారు. తెనాలి సీటును త్యాగం చేసేందుకు ఆలపాటి రాజా కూడా సిద్ధంగా లేరు. ఆలపాటి రాజా కూడా ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరికి వారే సీటు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న ఆలపాటి అనుచరులు..తెనాలి టికెట్ పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. మరోవైపు ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్రను మరింత స్పీడ్ పెంచారు. పదిరోజులుగా ప్రతి పల్లెకి, ప్రతి గడపకీ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తామని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పైకి చెబుతున్నా..లోలోపల సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి.. టికెట్ ఎవరికిచ్చినా పని చేస్తామని చెబుతున్న మాటలు మాటలకే పరిమితమవుతాయా? ఆచరణలో అమలు చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Updated On 23 Jan 2024 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story