తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు(Politics) కాసింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇంతకాలం బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఏ ఫార్ములాను అయితే అమలు పరిచిందో సరిగ్గా అదే ఫార్ములాను అధికార కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఆపరేషన్ గులాబీకి(Operation Gulabi) తెరలేపింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు(Politics) కాసింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇంతకాలం బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఏ ఫార్ములాను అయితే అమలు పరిచిందో సరిగ్గా అదే ఫార్ములాను అధికార కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఆపరేషన్ గులాబీకి(Operation Gulabi) తెరలేపింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. లేటెస్ట్‌గా పట్నం మహేందర్ రెడ్డి(Patnam mahendar Reddy) కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో(Mynampali Hanumanth Rao) కలిసి బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. దీంతో, ఈటల రాజేందర్(Etela rajendra) కూడా కాంగ్రెస్‌కు వెళ్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనుకున్నారు. బీజేపీలో చేరతారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఈటల సిద్ధాంతం వేరే, బీజేపీ సిద్ధాంతం వేరు. కాకపోతే ఎవరూ ఊహించని విధంగా ఈటల బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. నిజానికి ఆ విజయం బీజేపీది కాదనే చెప్పాలి. ఈటలకు ఉన్న ఇమేజే ఆయనను గెలిపించింది. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా ఆయనకు పరాజయమే ఎదురయ్యింది. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పార్టీ మారుతారా? బీజేపీలోనే కొనసాగుతారా? అసలు లోక్‌సభకు పోటీ చేసే ఆలోచన ఏమైనా రాజేందర్‌కు ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కొందరు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో!