వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాహుల్(rahul gandhi) సమక్షంలో ఖర్గే షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2021 జులై 8న ప్రారంభించిన వైఎస్సార్టీపీ(ysrtp)ని కూడా కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే షర్మిల చేరిక సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది.

brother anil
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల(YSRTP chief YS Sharmila) గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాహుల్(rahul gandhi) సమక్షంలో ఖర్గే షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2021 జులై 8న ప్రారంభించిన వైఎస్సార్టీపీ(ysrtp)ని కూడా కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే షర్మిల చేరిక సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge).. అక్కడే స్టేజీ మీద ఉన్న బ్రదర్ అనిల్(Brother Anil)కు కూడా కండువా కప్పే ప్రయత్నం చేశారు. అయితే బ్రదర్ అనిల్ మాత్రం కాంగ్రెస్లో చేరేందుకు, ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి నో చెప్పారు. దీంతో ఒక్కసారిగా అయోమయంలోపడిపోయిన ఖర్గే.. ఆ తర్వాత తేరుకొని సరేనన్నాడు. బ్రదర్ అనిల్ వ్యవహరించిన తీరుతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
