Mumbai : అది కామం కాదు, ప్రేమే!... పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి(rape) పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బాంబే హైకోర్టు(Bombay High Court) బెయిల్(Bail) ఇచ్చింది. దాంతో పాటుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి ఓడిగట్టిన 26 ఏళ్ల యువకుడు, మైనల్ బాలిక రిలేషన్‌లో(Relation) ఉన్నారని, వారి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే లైంగిక సంబంధం ఏర్పడిందని, దాన్ని కామం(Lust) అనకూడదని తెలిపింది. 'బాలిక మైనరే కావచ్చు.
13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి(rape) పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బాంబే హైకోర్టు(Bombay High Court) బెయిల్(Bail) ఇచ్చింది. దాంతో పాటుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి ఓడిగట్టిన 26 ఏళ్ల యువకుడు, మైనల్ బాలిక రిలేషన్‌లో(Relation) ఉన్నారని, వారి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే లైంగిక సంబంధం ఏర్పడిందని, దాన్ని కామం(Lust) అనకూడదని తెలిపింది. 'బాలిక మైనరే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం కొద్దే ఇంటిని వదిలి నిందితుడి నితిన్(Nitin) ధబేరావుతో కలిసి ఉంటున్నానని పోలీసులతో చెప్పింది. వారి మధ్య ప్రేమ ఉండటం వల్లే కలిసి ఉండాలనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే శారీరకంగా కలిశారు. అంతేకానీ నితిన్ ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురి చేయలేదు. ఆమెను బలవంతంగా అనుభవించలేదు' అని జస్టిస్ ఊర్మిళ జోషి(Justice Urmila Joshi) పార్కే తీర్పులో తెలిపారు. 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన ఉండే నితిన్ దామోదర్ ధబేరావును ప్రేమించింది. 2020 ఆగస్టులో(August) నితిన్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. కూతురు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు(Missing case) నమోదు చేసుకుని బాలికను వెతికి పట్టుకున్నారు. 2020 ఆగస్టు 30న పోలీసులు దామోదర్‌పై పోక్సో(Pocso) కేసు పెట్టారు. అక్టోబర్‌లో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే తాను ధబేరావ్‌ను ప్రేమించానని, ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లానని, అతడితో కలిసి జీవించడానికే ఇంట్లోంచి బంగారం, డబ్బును దొంగిలించానని ఆ బాలిక తెలిపింది.