Bir Tawil : ఈ ప్రదేశం ఏ దేశానికి సంబంధించినది కాదు..!
ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు వాటి భూసరిహద్దులు(Land Boundaries) నిర్ణయింపబడ్డాయి. ఏడుఖండాలుగా(7 Continets) ప్రపంచం విభజించబడింది. కొన్ని దేశాల మధ్య భూవివాదాలు ఉన్నప్పటికీ అవి పరిష్కరించుకోదగ్గవే ఉంటాయి. ప్రజలు ఏ దేశంలో నివసిస్తే.. ఆయా దేశాల నియమ, నిబంధనలను అనుసరిస్తారు. అయితే ప్రపంచలోని ఏ దేశం ఆ భూమి తమదేనని ప్రకటించుకోదు. ఆప్రదేశమేంటో చూద్దాం..

భూమ్మీద ఏ దేశానికి చెందని ప్రదేశం బిర్ తవీల్ అని.. బిర్ తవిల్(Bir Tawil) దాదాపు 2071.99 చ.కి.మీ (800 చదరపు మైళ్లు) భూభాగంలో ఉంది, ఇది ఈజిప్టు(Egypt) దక్షిణ సరిహద్దు, సూడాన్(Sudan) ఉత్తర సరిహద్దు మధ్య ఉంటుంది. భూమిని ఈజిప్ట్ కానీ, సూడాన్ కానీ, లేదా ఏ ఇతర దేశాలు తమదని ప్రకటించుకోలేదు.
ఇక్కడ మనుషులు నివసించలేరని.. మానవ జీవనశైలికి అనుకూల పరిస్థితులు లేనందునే ఈ ప్రాంతాన్ని ఏ దేశమూ క్లైయిం చేసుకోలేదని చెప్తున్నారు.