అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతం అయింది. కోట్లాది భారతీయుల కల సాకారమైంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగ సోమవారం మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాప్టర్‎లతో పూల వర్షం కురిపించారు.

అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతం అయింది. కోట్లాది భారతీయుల కల సాకారమైంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగ సోమవారం మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాప్టర్‎లతో పూల వర్షం కురిపించారు. ఇదే సమయంలో రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది భక్తులు పుకలరించిపోయారు. ఈ కార్యక్రమానికి ప్రధానిమోదీ(Prime minster Narendra Modi)తోపాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్(Governor Anandiben), సీఎం (Yogi Adityanath), ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) కూడా పాల్గొన్నారు. ఈ మహాత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఇక..ప్రాణ ప్రతిష్ఠ అనంతరం శ్రీరామచంద్రుడి ఫోటోలు తొలిసారి బయటికి వచ్చాయి. దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు ఆనందపడుతున్నారు. సకల ఆభరణాలతో అలంకరించిన బాలరాముడు..కమలంపై కొలువుదీరాడు. కుడి చేతలో బాణం. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపాన్నిచూసి రామ భక్తులు పులకించిపోతున్నారు.

Updated On 22 Jan 2024 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story