ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా చూసిన తర్వాత చాలా మందికి భవిష్యత్తు ఎలా ఉంటోందనన్న బెంగ పట్టేసుకుంది. ఈ భూమికి ఏమవుతుందోనన్న భయం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే జాతకాలు చెప్పేవాళ్లకు అంత డిమాండ్ ఇక్కడ! మనకు బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానం చెప్పేశారు. తత్వాలతో భవిష్యత్తు గురించి బాగా చెప్పారాయన!
ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా చూసిన తర్వాత చాలా మందికి భవిష్యత్తు ఎలా ఉంటోందనన్న బెంగ పట్టేసుకుంది. ఈ భూమికి ఏమవుతుందోనన్న భయం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే జాతకాలు చెప్పేవాళ్లకు అంత డిమాండ్ ఇక్కడ! మనకు బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానం చెప్పేశారు. తత్వాలతో భవిష్యత్తు గురించి బాగా చెప్పారాయన! మనకు బ్రహ్మంగారు ఎలాగో యూరోపియన్ దేశాలకు బాబా వంగా అలాగ! ఈమె అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. బల్గేరియాకు చెందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త ప్రపంచ కాలజ్ఞానిగా పేరు సంపాదించింది. ఆమె చెప్పి జోస్యాలు చాలా మట్టుకు నిజమమయ్యాయి. 1996లో తన 85 సంవత్సరాల వయసులో కన్నుమూసిన ఆమెను ఇప్పటికీ తల్చుకుంటున్నామంటే ఆమె చెప్పిన భవిష్యత్తు అంచనాలే! నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్‌గా పేరొందిన ఆమె తన పన్నెండేళ్ల వయసులో చూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆమె జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. 2021 సెప్టెంబరు 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి గురించి బాబా వంగా ముందే చెప్పారు. రెండు లోహపు పక్షులు (అంటే విమానాలు అన్నమాట) ట్విన్ టవర్స్‌ను ఢీకొంటాయని, అమాయకుల రక్తం ఏరులై పారుతుందని సంఘటన జరగడానికి చాలా ఏళ్ల కిందటే ఆమె చెప్పింది. అలాగే బ్రిటన్ యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే చెప్పారు. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన జోస్యాన్ని కొన్ని నిజమవుతున్నాయి. కేన్సర్ వ్యాక్సిన్‌ని రష్యా అభివృద్ధి చేస్తుందని, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి శక్తిమంతమైన దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటాయని బాబా వంగా ముందే చెప్పింది. బాబా వంగా చెప్పిన భవిష్యవాణులలో అత్యంత ప్రధానమైనది ప్రపంచం అంతమయ్యే తేదీ. ఆమె అంచనాల ప్రకారం విశ్వంలో అనూహ్యమైన సంఘటన కారణంగా 5079లో భూమి అంతం కానుంది. రాబోయే దశాబ్దాలలో ఆమె తెలిపిన ప్రముఖ అంచనాల వివరాలు చూద్దాం,
2025: ఐరోపాలో భారీ సంఘర్షణలు తలెత్తుతాయి. ఈ ఘర్షణల కారణంగా యూరప్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది.
2028: నూతన ఇంధన శక్తి వనరులను కనిపెట్టే ప్రయత్నంలో మనిషి శుక్రుడిని చేరుకుంటాడు.
2033: ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు గణనీయంగా పెరుగుతాయి. తీరంలో ఉన్న పట్టణాలు కనుమరుగవుతాయి.
2076: కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుంది.
2130: గ్రహాంతరవాసులతో భూవాసులకు పరిచయం ఏర్పడుతుంది.
2170: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం ఏర్పడుతుంది.
3005: అంగారకునిపై యుద్ధం జరుగుతుంది.
3797: భూమి నాశనం అవుతుంది. సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి మనిషి ప్రయాణిస్తాడు.
5079: ప్రపంచం అంతం అవుతుంది.