Andhra Pradesh : ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం..!
అంగన్వాడీ(Anganwadi) కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా(ESMA) చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను(GO 2) ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 6 నెలలపాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం పడినట్లే.
అంగన్వాడీ(Anganwadi) కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా(ESMA) చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను(GO 2) ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 6 నెలలపాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం పడినట్లే. ఇదిలా ఉండగా సమ్మె కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల(Helpers) జీతాల్లో ప్రభుత్వం కోతలు విధించింది. రూ.3 వేలు కోత పెట్టి రూ.8 వేల వేతనాన్ని అకౌంట్లలో జమ చేసింది.
అసలు ఎస్మా ఎందుకు ఉపయోగిస్తారు..?
ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మెకు దిగి ప్రజల జీవన విధానానికి ఆటంకాలు కలగకుండా అత్యవసర సర్వీసుల(Emergency Services) సేవల నిర్వహణ కొనసాగేలా 1981లో దీనిని రూపొందించారు. అత్యవసర సేవలకు ఆటంకాలు కలగకుండా.. ప్రభుత్వ రంగ కార్మికుల సమ్మెలను నిషేధించేందుకు ఈ చట్టం రూపొందించారు. ఎస్మా నిబంధనలను అతిక్రమిస్తే అరెస్ట్ వారెంట్(Arrest warrant) లేకుండా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్మా ప్రయోగించినా సమ్మెలో పాల్గొంటే విధుల నుంచి తొలగించడంతో పాటు వారికి జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశాన్ని ఈ ఎస్మా చట్టంలో పొందుపర్చారు.