ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ, JNTU అనంతపురం అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో AP EAMCET 2023 రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఈరోజు April 15, 2023చివరి తేదీ.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ(JNTU) అనంతపురం అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో AP EAMCET 2023 రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఈరోజు April 15, 2023చివరి తేదీ.

మార్చి 10, 2023న ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి(AP EAMCET 2023) సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి. లేట్ ఫీజు లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు చివరి తేదీ అని అభ్యర్థులు గమినించాల్సి ఉంటుంది . ఒకవేళ గడువు ముగిసిన తరువాత అప్లై చేసుకునే వారు రూ.500 మరియు రూ.1000 లేట్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు . కానీ దీనికి కూడాచివరి తేదీ వ ఏప్రిల్ 30 అలాగే మే 5, 2023 అని ఇవ్వడం జరిగింది .

AP EAMCET 2023 పరీక్షలు తేదీలు మే 15, 2023 నుండి మే 18, 2023 వరకు ఇవ్వడం జరిగింది . అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ పరీక్షలు మే 22, 2023 నుండి మే 23, 2023 వరకు జరుగుతాయి . పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్‌లు షెడ్యూల్ చేయటం జరిగింది . మే 9, 2023 నుండి హాల్ టికెట్స్ జారీచేయటం జరుగుతుంది .

పరీక్ష సమయాలు - ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు

AP EAMCET 2023 ఎలా అప్లై చేసుకోవాలి ?

అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళండి – cets.apsche.ap.gov.in
హోమ్‌పేజీలో, AP EAMCET 2023పై క్లిక్ చేయండి మరియు వెబ్‌సైట్ తెరవబడుతుంది
ముందుగా ఫీజు చెల్లించి, ఆపై ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది .
మీ పేమెంట్ స్టేటస్ చూసుకున్నాక ఆ తరువాత డౌన్‌లోడ్ చేయండి
ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ, బి.టెక్ - కోర్సుల కోసం మొదటి సంవత్సరంలో ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం AP EAMCET ప్రతి సంవత్సరం జరుగుతుంది. (డైరీ టెక్నాలజీ), B.Tech (Agr.Engg), B.Tech (Food Science and Technology) ;B.Sc. (Ag) / B.Sc. (హార్ట్) / B.V.Sc. & A.H / B.F.Sc ; బి. ఫార్మసీ, ఫార్మ్ డి.

Updated On 15 April 2023 5:46 AM GMT
rj sanju

rj sanju

Next Story