సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా రామచంద్రాపురంలో(Ramchandrapuram) ఓ బాలుడు సాహసమే చేశాడు. రామచంద్రాపురంలోని కాకతీయనగర్‌లో(Kakatiya Nagar) ఉంటున్న బాలుడు కుటుంబం.. వారి ఇంటి ముందున్నచెట్టును నరికివేయడానికి వచ్చినవారిని అడ్డుకున్నాడు. అవసరమైతే నన్నునరకండి కానీ చెట్టును నరకకండి అని వేడుకున్నాడు. ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం..!

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాకతీయనగర్‌లో ఉంటున్న ఓ బాలుడి ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు(Trees) ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు ఆ రోడ్డును వెడల్పు(Road Extension) చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పెద్దపెద్ద చెట్లను నరికివేస్తున్నారు. అనిరుద్(Anirudh) అనే బాలుడి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టును నరికేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నించారు. వెంటనే చెట్టు ఎక్కి బాలుడు కూర్చున్నాడు. దయచేసి చెట్టును నరకొద్దని వేడుకున్నాడు. చెట్లంటే తనకిష్టమని, ఈ చెట్లమీద పలు రకాల పక్షుల గూళ్లు ఉన్నాయని వాపోయాడు. సార్ ప్లీజ్ సార్... చెట్టును కొట్టివేయకండి సార్ అని వేడుకున్నాడు. చెట్టును నరకను అని చెప్పేవరకు దిగను అని మొరాయించాడు. ఈ వయసులోనే పర్యావరణం(Environment) పట్ల బాలుడు అనిరుద్‌కు ఉన్న అవగాహనను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అవసరమైతే నేను చచ్చిపోతా కానీ చెట్టును కొట్టివేయరాదని బతిమలాడాడు. అధికారులు కాసేపు చెట్టును నరకడం ఆపేశారు. చెట్లను నరకకుండా వెనక్కి వెళ్లిపోవాలని బాలుడు డిమాండ్ చేశాడు. నానా తంటాలు పడి అనిరుద్‌ను చెట్టుపై నుంచి కిందికి దించారు. రోడ్డు విస్తరణ కోసం పెద్ద పెద్ద చెట్లను నరకకుండా రీ లోకేట్ చేయాలని.. ఇంత పెద్ద చెట్లను పెట్టి పెంచాలంటే కొన్నేళ్ల సమయం పడుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.