టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta)రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్(Speaker) ఆమోదించారు. రెండేళ్ల  కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు(Vaisakha steel plant) మద్దతుగా గంటా తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ (TDP)తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta)రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్(Speaker) ఆమోదించారు. రెండేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు(Vaisakha steel plant) మద్దతుగా గంటా తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ (TDP)తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఈనెల 22న ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు మంగళవారం తెలిపారు.

ఏపీకి సంబంధించి రాజ్యసభ(Rajyasabha) ఎన్నికలు జరగనున్న తరుణంలో గంటా రాజీనామాను ఆమోదించడం వైసీపీ(YSRCP) రాజకీయ వ్యూహంలో భాగమేనని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఏపీలో కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేశ్ (BJP), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ) పదవీకాలం పూర్తికావొస్తోంది. వీరిస్థానాల్లో ముగ్గురు కొత్తవారిని రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. ఆ స‌మ‌యానికి గంటా శ్రీనివాసరావు ఓటు హక్కు కోల్పోనున్నారు.

Updated On 23 Jan 2024 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story