అనంతపురానికి(Anantapur) చెందిన దళిత(Dalit) బాలిక స్నేహలత(Snehalatha) హత్యకు నష్టపరిహారంగా ప్రభుత్వం(Government) ఇచ్చిన ఐదు ఎకరాల భూమిలోకి రానివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు అంటూ స్నేహలత తల్లి మాదిగలక్ష్మి హైకోర్టులో(High court) వ్యాజ్యం దాఖలు చేసింది. తన కూతురు మరణానికి నష్టపరిహారంగా ఇచ్చిన భూమిలో అధికారులు వ్యవసాయం(Agriculture) చేసుకోనీయకుండా అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ తరపున వాదనలను ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్(Jada sravan kumar) వినిపించారు

దళిత బాలిక మరణానికి నష్టపరిహారంగా ఇచ్చిన భూమిలోకి వెళ్ళనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ(Revenue) అధికారులు అడ్డుకుంటున్నారంటూ వాదించారు. అసైన్మెంట్(Assignment) పట్టా 1-బి , అడంగల్, పట్టాదారు పాస్ బుక్(Pass book) ఉన్నప్పటికీ తన క్లైంట్‌ను అడ్డుకోవడం సరికాదని జడ శ్రవణ్‌కుమార్ వాదించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులే అడ్డుపడడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి అధికారులు అడ్డుకోవద్దని హైకోర్టు చెప్పింది. ఇందుకు సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్(Collector), రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నాలుగు వారాల్లోగా కౌంటర్(Counter) దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.