అంగన్ వాడీలకు(Anganwadi) ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు.విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా(ESMA) చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు.తక్షణమే విధుల్లో చేరాలంటూ అంగన్ వాడీలకు ఏపీ(Andhra Pradesh) ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది.

అంగన్ వాడీలకు(Anganwadi) ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు.విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా(ESMA) చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు.తక్షణమే విధుల్లో చేరాలంటూ అంగన్ వాడీలకు ఏపీ(Andhra Pradesh) ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. నిన్న సాయంత్రం 5గంటలకల్లా సమ్మెను విరమించి విధులకు హాజరవ్వాలని ప్రభుత్వ అల్టిమేటమ్ జారీ చేసింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించబోతోంది. గత 29 రోజులుగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్నారు.సమ్మెను విరమించి , విధుల్లో చేరాలని సమ్మెలో పాల్గొన్న అంగన్ వాడీ వర్కర్లు అందరికీ జిల్లాల కలెక్టర్ల ద్వారా సందేశాలు అందాయి.అంగన్ వాడీ వర్కర్లు ఆందోళనలు చేస్తున్న శిబిరాల వద్దకు వెళ్లి పోలీసులు(Police) ఈ విషయాన్ని చెప్పారు. సాయంత్రం 5గంటలకల్లా ఎవరికివారు శిబిరాలు తీసేయాలని, విధుల్లో జాయిన్ అవ్వాలని, లేదంటే.. అరెస్ట్(Arrest) చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ అంగన్ వాడీలు తగ్గలేదు. అరెస్టులు చేసినా, ఉద్యోగం నుంచి తీసివేసినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా.. వెనక్కి తగ్గేది లేదని, తమ డిమాండ్లు(Demands) పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు.

ప్రభుత్వం (Government)ఇచ్చిన డెడ్ లైడ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఈరోజు నుంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల(Collector) ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల కింద అంగన్ వాడీల సేవలు ఉన్నాయి కాబట్టి విధుల్లో చేరకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లకు(Workers) ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే, అంగన్ వాడీలు మాత్రం తగ్గలేదు. ప్రభుత్వంతో తమతో చర్చలు జరపాలని, తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని అప్పటివరకు కూడా సమ్మెను కొనసాగిస్తామని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అన్నింటికీ సిద్ధపడే ఉన్నామన్నారు.

సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, పీఎఫ్(PF), ఈఎస్ఐ(ESI) వంటి సౌకర్యాలు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేసేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు.

Updated On 9 Jan 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story