Burnt alive : దుప్పటికి మంటలు అంటుకొని వృద్ధుడి సజీవదహనం..!
సాధారణంగా గ్రామాల్లో(Villages) చలికాలంలో చలిమంటలు వేసుకొని కాచుకుంటుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చలి(Cold waves) పులి పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చలి మంటలు కాచుకుంటుండగా దుప్పటికి(Blanket) మంటలు అంటుకొని మృతిచెందాడు. ఈ విషాద ఘటన విజయనగరం(Vijayanagaram) జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

చలి తీవ్రత పెరగడంతో విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో 75 ఏళ్ల వృద్ధుడు తిమ్మ నాగయ్య(Nagaiah) తన పశువుల పాకలో చలి మంట పెట్టుకున్నాడు. పాకలో నిద్రిస్తుండగా తిమ్మ నాగమయ్య దుప్పటికి మంటలు అంటుకున్నాయి. ఇది గమనించని నాగమయ్య మంటలు శరీరానికి పాకి అక్కడిక్కడే మృతి చెందాడు. చలి మంటలు దుప్పటికి అంటుకోవడంతోనే నాగమయ్య చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. అతని భార్య సన్యాసమ్మ(Sanyasamma) ఫిర్యాదు ఇవ్వండంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.