Solar Eclipse Effect : సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం... రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం!
సంపూర్ణ సూర్యగ్రహణం(Solar Eclipse) సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటున్నారు అమెరికాలోని(America Experts) ఎక్స్‌పర్ట్స్. 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు(Road accident) జరిగాయి. వాటితో పోలిస్తే ఈసారి 31 శాతం ప్రమాదాలు పెరగవచ్చంటున్నారు. 2017లో గ్రహణం కనిపించే విస్తీర్ణం 70 మైళ్లే.. దీన్ని పాత్ ఆఫ్ టొటాలిటీ అంటారు.
సంపూర్ణ సూర్యగ్రహణం(Solar Eclipse) సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటున్నారు అమెరికాలోని(America Experts) ఎక్స్‌పర్ట్స్. 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు(Road accident) జరిగాయి. వాటితో పోలిస్తే ఈసారి 31 శాతం ప్రమాదాలు పెరగవచ్చంటున్నారు. 2017లో గ్రహణం కనిపించే విస్తీర్ణం 70 మైళ్లే.. దీన్ని పాత్ ఆఫ్ టొటాలిటీ అంటారు. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూడటానికి కోటీ 20 లక్షల మంది వచ్చారు. మరి ఈ రోజున ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో కనిపిస్తుంది. గ్రహణాన్ని వీక్షించడానికి 316 మిలియన్‌ల మంది వస్తారని నాసా(NASA) అంచనా వేసింది. గ్రహణం సమయంలో దానికి చూడటానికి ఎక్కడివారు అక్కడే ఆగిపోయి ఉంటారు. అప్పుడు ప్రమాదాలు స్వల్పంగానే ఉంటాయి. కాకపోతే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలకు చేరుకోవడానికి వెళుతున్నప్పడు, మళ్లీ గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు ఓ ప్రమాదం జరుగుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలలో మాత్రమే కనిపించింది. ఇప్పుడు సంభవించే సూర్యగ్రహణం కెనడాలోని టోరంటతో పాటు ఎనిమిది పెద్ద నగరాలలో కనిపించనుంది. దీన్ని చూసేందుకు అబ్జర్వేటరీలకు వెళుతుంటారు ప్రజలు. అలా రోడ్డెక్కేవారు లక్షల్లో ఉంటారు. అందుకే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది.