అంబటి రాయుడు వైసీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పార్టీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలగుతున్నట్టు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు . కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు వివరణ ఇచ్చారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానంటూ అంబటి రాయుడు వెల్లడించారు.

అంబటి రాయుడు వైసీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పార్టీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ(ysrcp) నుంచి వైదొలగుతున్నట్టు అంబటి రాయుడు(ambati rayudu) ట్వీట్ చేశాడు . కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు వివరణ ఇచ్చారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానంటూ అంబటి రాయుడు వెల్లడించారు. ఇక గత కొన్ని రోజులుగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన అంబటిరాయుడు డిసెంబర్ 28న ఏపీ సీఎం జగన్(ap cm jagan) సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ(Gunturu mp)గా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇంతలోనే అంబటి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated On 6 Jan 2024 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story