సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసుల వైఖరిని అల్లు అర్జున్ తప్పుబట్టారు. బట్టలు మార్చుకునే సమయం ఇవ్వలేదని అల్లు అర్జున్ ఆరోపించారు. బెడ్‌రూంలోకి వచ్చి మరీ అరెస్ట్ చేయడం టూమచ్ అని పోలీసులతోనే అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఇది టూమచ్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఇదైతే మంచి పద్ధతి కాదన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను ఏ-2 నిందితుడిగా చేర్చారు. పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు నమోదు చేశారు. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక మరో సెక్షన్ BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం