సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాము పుష్ప 2 ప్రీమియర్ షోకి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లామని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసిందని, ఇద్దరు పిల్లల తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే మా చిత్ర బృందం అంతా షాక్ కు గురయ్యామని అల్లు అర్జున్ గతంలో ఓ వీడియో కూడా విడుదల చేశారు

ehatv

ehatv

Next Story