Alla Ramakrishna Reddy into Congress: షర్మిల వెంటే నేను..త్వరలో కాంగ్రెస్లో చేరతాః ఆర్కే
మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే షర్మిల నేతృత్వంలో తను కూడా కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. ఇక ముందు షర్మిలతోపాటు రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. అలాగే మంగళగిరిలో పోటీపై షర్మిల సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన నాటి నుంచి ఏ పార్టీలో చేరుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రామకృష్ణారెడ్డి ఆ విషయంపై పూర్తి క్లారిటి ఇచ్చినట్లయింది.

alla ramakrishnareddy
మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే షర్మిల(Sharmila) నేతృత్వంలో తను కూడా కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. ఇక ముందు షర్మిలతోపాటు రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. అలాగే మంగళగిరి(Mangalagiri)లో పోటీపై షర్మిల సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన నాటి నుంచి ఏ పార్టీలో చేరుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రామకృష్ణారెడ్డి ఆ విషయంపై పూర్తి క్లారిటి ఇచ్చినట్లయింది. తాను వైఎస్ఆర్ కుటుంబానికి(ysr family) భక్తుడినని, షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లేది నిజమైతే..ఆమెతోనే తన ప్రయాణం ఉంటుందని ఇటీవల ఆర్కే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీమా చేసినప్పటికీ..ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. "నా రాజీనామా ఆమోదించక పోవడం అనేది వాళ్ల ఇష్టం.. నేను మాత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని" ఇటీవల ఆళ్ల అన్నారు. తిరిగి మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు సీఎం జగన్(cm jagan) సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
