Alaska Flight Incident : టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం డోర్ ఓపెన్..!
అలాస్కా ఎయిర్‌లైన్స్(Alaska Airlines) బోయింగ్ 737-9 MAX విమానం టేకాఫ్(Flight Takeoff) అయిన కొద్ది నిమిషాల తర్వాత దాని తలుపులలో(Gates) ఒకటి తెరుచుకోవడంతో ఈరోజు ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్(Mid cabin Exist Door) విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తుంది. AS1282 పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియో, కాలిఫోర్నియాకి బయలుదేరిన వెంటనే ఈ సంఘటన చోటు చేసుకుంది.
అలాస్కా ఎయిర్‌లైన్స్(Alaska Airlines) బోయింగ్ 737-9 MAX విమానం టేకాఫ్(Flight Takeoff) అయిన కొద్ది నిమిషాల తర్వాత దాని తలుపులలో(Gates) ఒకటి తెరుచుకోవడంతో ఈరోజు ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్(Mid cabin Exist Door) విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తుంది. "AS1282 పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియో, కాలిఫోర్నియాకి(Calfornia) బయలుదేరిన వెంటనే ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. డోర్ తెరుచుకోవడంతో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా తిరిగి ల్యాండైంది.. డోర్ తెరుచుకోడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని అలస్కా తెలిపింది. ఈ రకమైన సంఘటన చాలా అరుదుగా జరిగినప్పటికీ.. విమానంలో శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని, పరిస్థితిని చక్కదిద్దారని అలస్కా ఓ ప్రకటనలో తెలిపింది. విమానం డోర్ ఓపెన్ అయిన వీడియోను ఓ ప్రయాణికుడు తీయగా సోషల్ మీడియాలో(Social media) ఇది వైరల్‌గా మారింది.