Akhilapriya conditions for TDP: టీడీపీ అధిష్టానానికి అఖిలప్రియ ఝలక్ !
ఏపీలో ఎన్నికల రాజకీయం అప్పుడే సరకందాయంలోపడింది. అభ్యర్థుల మార్పుతో అధికార వైసీపీలో అసమ్మతిగళం వినిపిస్తుండగా..తాజాగా ప్రతిపక్ష టీడీపీలోనూ టికెట్ హామీ లభించని నేతలు..అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తుతో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. దీంతో టికెట్ ఇస్తారా.. లేదా? అనే అనుమానం వచ్చిన నేతలు అధిష్టానంతో తాడేపేడో తేల్చుకునే పనిలోపడ్డారు.
ఏపీలో ఎన్నికల రాజకీయం అప్పుడే సరకందాయంలోపడింది. అభ్యర్థుల మార్పుతో అధికార వైసీపీ(ycp)లో అసమ్మతిగళం వినిపిస్తుండగా..తాజాగా ప్రతిపక్ష టీడీపీ(tdp)లోనూ టికెట్ హామీ లభించని నేతలు..అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తుతో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. దీంతో టికెట్ ఇస్తారా.. లేదా? అనే అనుమానం వచ్చిన నేతలు అధిష్టానంతో తాడేపేడో తేల్చుకునే పనిలోపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న పార్టీలు..బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టాయి. అభ్యర్థుల మార్పు వ్యవహారం అధికార వైసీపీకి తలనొప్పిగా మారింది. టికెట్ నిరాకరించినబడిన నేతలు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు .తాజాగా ప్రతిపక్ష టీడీపీలోనూ అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. టిడీపీ-జనసేన పొత్తు(tdp-janasena alliance) కారణంగా..ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన టీడీపీ ఆశావహుల్లో మొదలైంది. దీంతో ముందస్తుగా టికెట్ ఇచ్చే విషయాన్ని తేల్చాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. జనసేనకు 10 లేదా 15 లోపు సీట్లతో ఇస్తారనే ప్రచారం ఉంది. అంతకంటే ఎక్కువ సీట్లు అడిగితే..టీడీపీ పెద్దలకు తలబొప్పికట్టడం ఖాయం. ఇప్పటికే తణుకు, గుడివాడ, నరసారావుపేట తదితర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆళ్లగడ్డలో టీడీపీ ఇన్‌చార్జ్(tdp incharge) భూమా అఖిలప్రియ(bhuma akhila priya)కు చంద్రబాబు(chandrababu) టికెట్ ఖరారు చేయలేదు. దీంతో ఈ నెల 9న ఆళ్లగడ్డ(allagadda)లో జరగనున్న చంద్రబాబు సభకు ముందే టికెట్ అంశాన్ని తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. తనకు టికెట్ హామీ ఇవ్వకపోతే.. సభను విజయవంతం చేయడానికి అఖిలప్రియ సుముఖంగా లేరన్నది విశ్వసనీయ సమాచారం. ఇదే అదనుగా అధిష్టానంపై ఒత్తిడి పెంచి టికెట్ కేటాయింపు అంశాన్ని తేల్చుకోవాలని భావిస్తున్నారట. టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు తానెందుకు సభ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని ఆమె ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తమ నాయకురాలి షరతు పెట్టడంలో తప్పేంటని ప్రశ్నిప్తోంది భూమ అఖిలప్రియ అనుచరవర్గం. మరి..అఖిల షరతుకు తలొగ్గి టికెట్ ఖరారు చేస్తారా? లేదా? అనేదానిపై ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.