గౌరవ ప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం. మంచి జీతం. అయినా ఆశ. అవినీతి వైపు అడుగులు వేసేలా చేసింది. చివరకు అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయేలా చేసింది. కొద్దికాలం విరామం తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాపై కన్నేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి జరిపారు. రెండు లక్షల 25 వేల రూపాయాల లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసిబి కి పట్టుబడ్డారు. ఏసిబికి దొరికిపోయిన వారిలో జిల్లా […]

గౌరవ ప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం. మంచి జీతం. అయినా ఆశ. అవినీతి వైపు అడుగులు వేసేలా చేసింది. చివరకు అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయేలా చేసింది. కొద్దికాలం విరామం తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాపై కన్నేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి జరిపారు. రెండు లక్షల 25 వేల రూపాయాల లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసిబి కి పట్టుబడ్డారు. ఏసిబికి దొరికిపోయిన వారిలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి విజయలక్ష్మీతోపాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో పేషంట్ కేర్ యూనిట్ కు సంబంధించిన విభాగంలో 24 మంది సిబ్బంది నియామకాలను ఔట్ సోర్సింగ్ పద్దతో చేపట్టారు.

అయితే ఇందుకు సంబంధించిన కాంట్రాక్ట్ ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ కి దక్కింది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రం జిల్లా ఉపాధి కల్పనాధికారి జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ పత్రం జారీ చేసేందుకు ఉపాధి కల్పనాధికారి లేబర్ సొసైటి డైరెక్టర్ దుర్గం శేఖర్ ను మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా డైరెక్టర్ రెండు లక్షల 25 వేల రూపాయలకు ఉపాధికల్పనాధికారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సొసైటీ డైరెక్టర్ రెండు లక్షల 25 వేల రూపాయల లంచం ఉపాధి కల్పానాధికారి కార్యాలయంలో ఇస్తుండగా ఏసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ముందుగానే డబ్బులపై కెమికల్స్ వేసిన ఏసిబి అధికారులు ఆ డబ్బులను ఉపాధి కల్పన శాఖ అధికారులు తీసుకున్నట్లు నిర్దారించారు. కరీంనగర్ ఏసిబి డిఎస్ పి కె. భద్రయ్య ఆధ్వర్యంలో లంచం తీసుకుంటున్న ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి విజయ లక్ష్మీ, రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తేజ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులను కరీంనగర్ లోని ఏసిబి కోర్టులో హజరుపరుచనున్నట్లు ఏసిబి డి.ఎస్.పి కె. భద్రయ్య తెలిపారు.

Updated On 9 Feb 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story