రెరా(RERA) కార్యదర్శి, హెచ్‌ఎండీఏ(HMDA) మాజీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ శివబాలకృష్ణను(Shiva balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది.
శివ బాలకృష్ణ హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అక్రమంగా భారీగా ఆస్తులను(Properties) కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపిన ఏసీబీ(ACB) అధికారులు..గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

మణికొండలోని ఆదిత్యపోర్ట్‌ వ్యూలో విల్లా నంబర్‌ 25 శివబాలకృష్ణ నివాసం. 2018 నుంచి 2023 వరకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆరు నెలల కిందట రెరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ) కార్యదర్శిగా బదిలీ అయ్యారు. మెట్రోరైల్‌ ప్లానింగ్‌(Metro Rail Planing) అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివబాలకృష్ణపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన ఆస్తుల చిట్టాపై ఇటీవల ఏసీబీ ఆరా తీసింది. బుధవారం ఉదయం నుంచి ఏసీబీ 20 బృందాలుగా విడిపోయి 17 చోట్ల సోదాలు చేపట్టింది. శివ బాలకృష్ణ ఇళ్లు, ఆఫీస్ లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో రూ.20 కోట్ల నగదు, ఖరీదైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌లు, కిలోలకొద్దీ బంగారు(Gold), వెండి ఆభరణాలు(Silver), విలువైన బహుమతులు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లను గుర్తించినట్టు తెలిసింది. శివ బాలకృష్ణకు సంబంధించిన మరో నాలుగు లాకర్లను తెరిస్తే..మరిన్ని విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు, అధికారుల అండతోనే శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. బాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలను కూడా గుర్తించారు.

Updated On 25 Jan 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story