గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల దారి మళ్లింపు, పశుసంవర్ధక భవన్ లో ఫైళ్లు మాయమైన వ్యవహారంపై విచారణను ఏసీబీకి అప్పగించింది. ఇప్పటికే దీనికి సంబంధించి నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జరిగిన అవకతవకలపై మరింత దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం..ఈ రెండు కేసులను ఏసీబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల దారి మళ్లింపు, పశుసంవర్ధక భవన్ (Pasushvardhak Bhawan)లో ఫైళ్లు మాయమైన వ్యవహారం(Files missing incident)పై విచారణను ఏసీబీ విచారణ (ACB investigation)కు అప్పగించింది. ఇప్పటికే దీనికి సంబంధించి నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ (Gachibowli police station)లో కేసు నమోదైన (case registered) సంగతి తెలిసిందే. ఇందులో జరిగిన అవకతవకలపై మరింత దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం..ఈ రెండు కేసులను ఏసీబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గొర్రెల పంపిణీ కేసు(Sheep distribution case )లో కీలక అంశాలు వెలగులోకి వచ్చాయి. ఏపీ రైతుల(Ap Farmers)కు ఇవ్వాల్సిన నిధులను దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి (benami accounts) రూ.2.08 కోట్లు దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై ఏపీకి చెందిన సన్నిబోయిన ఏడుకొండలు (Sanniboina Edukondalu) అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్య పశుసంవర్ధన్ శాఖ( Animal Husbandry Department) అసిస్టెంట్ డైరెక్టర్లు (Assistant Directors) రవికుమార్ (Ravikumar), ఆదిత్య కేశవసాయి (Aditya Keshav Sai), కాంట్రాక్టర్లు మొయినుద్దీన్ (contractors Moinuddin), అతని కుమారుడు ఇక్రమ్‌ ( Ikram ) ఏపీలో పర్యటించారు. ఈ క్రమంలో 133 గొర్రెల యూనిట్లను 18 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఒక్కో యూనిట్లో 21 గొర్రెలు ఉన్నాయి. రైతుల బ్యాంకు వివరాలను కూడా పశు సంవర్ధక అధికారులు తీసుకున్నారు. ఆ మేరకు.. గొర్రెలు విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ కావాల్సిన నగదు..దళారుల బినామీల ఖాతాల్లోకి దారి మళ్లించారు. ఏపీ రైతులకు బదులు బినామీ అకౌంట్ నంబర్లకు గత ప్రభుత్వ అధికారులు నగదు బదిలీ చేయండం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పశుసంవర్థక శాఖ ఏడీలు రవికుమార్‌, ఆదిత్య కేశవ సాయితోపాటు ఇద్దరు దళారులపై ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే..గొర్రెల పంపిణీ స్కీంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడం, ముఖ్యమైన పైళ్లు మాయం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సహకార సమాఖ్య ద్వారా గొల్ల-కుర్మలు-యాదవులకు సబ్సీడి పద్ధతిన గొర్రెలు పంపిణీ (subsidized basis sheep Distribution) చేసే ఈ స్కీంను గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌ చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది. యూనిట్‌ కు 20 గొర్రెలు, ఒక పొట్టేల్‌ ను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం భరించగా.. అప్పటి ప్రభుత్వమే 75 శాతం చెల్లించింది. అంటే యూనిట్‌ ధరను సర్కార్‌ రూ.1.25 లక్షలుగా నిర్ణయించగా..ప్రభుత్వం రూ.93,750 వేలు, లబ్ధిదారుడు రూ.31,250 వేల చొప్పున చెల్లించారు. అయితే..ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీం..పూర్తిగా కమీషన్ల స్కాంగా మారిపోయిందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. రెండో దఫా గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన వారికి పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో డీడీలు కట్టిన గొల్ల-కుర్మలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టిన డీడీ అమౌంట్‎ను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated On 16 Jan 2024 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story