శామీర్‌పేట(Shameerpet) తహశీల్దార్ లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 లక్షల నగదుతో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్‌సత్యనారాయణ(satyanarayana) ఏసీబీ వలకు చిక్కారు.
శామీర్‌పేట(Shameerpet) తహశీల్దార్ లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 లక్షల నగదుతో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్‌సత్యనారాయణ(satyanarayana) ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహశీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ముందస్తు ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహశీల్దార్ తీసుకోవాలని చెప్తేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపడంతో తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు.