బెంగళూరులో(Bangalore) దారణం చోటు చేసుకుంది. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న ర్యాపిడో రైడర్(Rapido Driver) నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి బైక్‌పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి.
బెంగళూరులో(Bangalore) దారణం చోటు చేసుకుంది. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న ర్యాపిడో రైడర్(Rapido Driver) నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి బైక్‌పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ నెల 21వ తేదీ రాత్రి 11.10 గంటలకు బెంగళూరుకు చెందిన ఓ యువతి తాను పని చేసే ప్రాంతం నుంచి ఇందిరానగర్‌లోని తన ఇంటికి వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసింది. యువతిని బైక్ ఎక్కించుకున్న రైడర్ ఓటీపీ చెక్ చేయాలంటూ ఆమె ఫోన్ తీసుకున్నాడు. తర్వాత బైక్‌ను ఇందిరానగర్ వైపు కాకుండా దొడ్డబల్లాపూర్ వైపుకు తీసుకెళ్లసాగాడు. ఇటువైపు ఎందుకు తీసుకెళుతున్నావని యువతి ఎంతగా అడుగుతున్నా ర్యాపిడో రైడర్ పట్టించుకోకుండా వేగం పెంచాడు. పైగా యువతిని ఎక్కడపడితే అక్కడ తడమసాగాడు. అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఆ యువతి రైడర్ చేతిలో ఉన్న ఫోన్‌ను లాగేసుకుంది. మాన, ప్రాణాలను కాపాడుకునేందుకు రన్నింగ్ బైక్ నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడింది. కుంటుకుంటూనే ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయి తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. తర్వాత ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి కటకటాల వెనక్కి తోశారు. కీడు శంకించిన ఆమె ముందుగా పోలీసులకే ఫోన్ చేశారట. కానీ పోలీసులు మాత్రం ఇదోదే బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ తగాదా అని లైట్ తీసుకున్నారట! జరిగిన ఘటనను ర్యాపిడో వారికి కూడా చెప్పిందట! వారి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదట!