సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్న ఓ వీడియో భయకంపితులను చేస్తోంది. ఆ వీడియోలో ఓ గల్లీలో భూమికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లలోంచి సగ భాగం లోపలికి, సగభాగం బయటకు వున్న ఓ పెద్ద మొసలి(crocodile) కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకునే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతున్న ఓ వీడియో భయకంపితులను చేస్తోంది. ఆ వీడియోలో ఓ గల్లీలో భూమికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లలోంచి సగ భాగం లోపలికి, సగభాగం బయటకు వున్న ఓ పెద్ద మొసలి(crocodile) కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకునే ప్రయత్నం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోలోనే మరో మొసలి భూమిని చీల్చుకుని రావడాన్ని చూడొచ్చు. ఇలా భూమిని చీల్చుకుంటూ మొసళ్లు రావడం చూసి జనం హడలిపోయారు. అసలు మరో మొసలి నేల లోపలి నుంచి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అక్కడ ఉన్న వారిని కరకరమంటూ నమిలి మింగేయాలన్న కసితో మొసళ్లు బయటకు వచ్చాయి. ఆ మొసళ్లను పట్టుకోవడానికి అధికారులు ఎంతగానో శ్రమించారు. ఎలాగోలా వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టారు. అయితే ఈ వీడియో ఎక్కడిదో, ఎప్పటిదో తెలియదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం బాగా వైరల్‌ అవుతోంది. ఇది నమ్మశక్యంగా లేదంటున్నారు కొందరు నెటిజన్లు.

Updated On 12 Aug 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story