ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) వినూత్నంగా ఆలోచించాడు. తాను గంజాయికి బానిస అయ్యాడు. ప్రతిసారీ గంజాయి కొనుక్కునేందుకు వీలు పడదు కదా..! సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌ను డెవలప్ చేసినట్లు.. గంజాయిని డెవలప్ చేద్దామని చూశాడు
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) వినూత్నంగా ఆలోచించాడు. తాను గంజాయికి బానిస అయ్యాడు. ప్రతిసారీ గంజాయి కొనుక్కునేందుకు వీలు పడదు కదా..! సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌ను డెవలప్ చేసినట్లు.. గంజాయిని డెవలప్ చేద్దామని చూశాడు. గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసుల చేతికి చిక్కాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారాసిగూడ (Varasiguda) పార్సీగుట్టకు చెందిన రాహుల్ రాజ్ (29) (RahulRaj) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయికి రాహుల్‌రాజ్ బానిస అయ్యాడు. ప్రతిసారి గంజాయి విక్రయించేవారి దగ్గరికి వెళ్లి కొనుక్కోవడం ఇబ్బంది అనుకున్నాడేమో.. అందుకు తనే ఒక ఐడియా వేశాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలను (cannabis Plants) పెంచితే ఎలా ఉంటుందన్న ప్లాన్ వేశాడు. గంజాయి సరఫరా చేసి ముఠా దగ్గర ఈ మొక్కల సీడ్స్‌ను సేకరించి ఇంట్లోనే పెంచడం ప్రారంభించాడు. విషయం ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల చెవుల వరకు చేరింది. దీంతో రాహుల్‌రాజ్ ఇంటికి చేరుకొని పోలీసులు తనిఖీలు చేశారు. మూడు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు వారు గుర్తించారు. గంజాయి సీడ్స్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.