River Changed It's Color : రాత్రికి రాత్రే నెత్తుటి రంగులోకి మారిపోయిన నది
రాత్రికి రాత్రే ఆ నదిలోని(River) నీరంతా ఎరుపురంగులోకి(Red Color) మారిపోయింది. అసలేం జరిగిందో తెలియక స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జపాన్(Japan) ఒకినావాలో(Okinava) జరిగింది. అక్కడి నాగో సిటీలోని ఓడరేవు దగ్గర ఉన్న నది ఇలా హఠాత్తుగా రెడ్ కలర్‌లోకి మారిపోయింది. ఓరియన్ బ్రూవరీస్(Orion Breweries) అనే బీర్ ఫ్యాక్టరీ లీక్(Beer Factory) కారణంగానే ఇది జరిగిందని అధికారులు అంటున్నారు.
రాత్రికి రాత్రే ఆ నదిలోని(River) నీరంతా ఎరుపురంగులోకి(Red Color) మారిపోయింది. అసలేం జరిగిందో తెలియక స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జపాన్(Japan) ఒకినావాలో(Okinava) జరిగింది. అక్కడి నాగో(Nago) సిటీలోని ఓడరేవు(Odarevu) దగ్గర ఉన్న నది ఇలా హఠాత్తుగా రెడ్ కలర్‌లోకి మారిపోయింది. ఓరియన్ బ్రూవరీస్(Orion Breweries) అనే బీర్ ఫ్యాక్టరీ లీక్(Beer Factory) కారణంగానే ఇది జరిగిందని అధికారులు అంటున్నారు. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఓ కెమికల్(chemical) కారణంగా నది నీళ్లు ఎర్రగా మారాయంటున్నారు. ఈ రసాయనాన్ని కాస్మెటిక్(cosmetic) పరిశ్రమలో వినియోగిస్తారని చెబుతూ సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని చెప్పారు. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెప్పారు. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని అధికారులు తెలిపారు. లీకైన శీతలీకరణ నీరు నదిలోకి ప్రవహించడం వల్ల ఇలా రంగు మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఎరుపు రంగులోకి మారిందని ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ అంటోంది. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పుకుంది.